
నల్గొండ, 19 నవంబర్ (హి.స.)
ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు నుండి కురుమర్తి గ్రామం వరకు నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన 57 మంది కల్యాణ లక్ష్మి, 25 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను తాసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని రంగాల్లో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన పేదల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు