
అదిలాబాద్, 19 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా
పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఈ పథకం ఆపద సమయంలో సంజీవనిలా పని చేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వేలాది మంది పేద ప్రజలు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..