రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.. ఎంపీ రవిచంద్ర
ఖమ్మం, 19 నవంబర్ (హి.స.) ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జూలూరుపాడు మండల కేం
MP Ravi Chandra


ఖమ్మం, 19 నవంబర్ (హి.స.)

ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రం (సబ్ మార్కెట్ యార్డ్) ను పరిశీలించి రైతులు, హమాలీలు, ట్రేడర్లతో ఎంపీ మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంలో సంబంధం లేకుండా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 కి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande