
జయశంకర్ భూపాలపల్లి, 19 నవంబర్ (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అనర్హులకు అధికార పార్టీ నాయకుల అనుచరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారని ప్రజలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు.
వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 416 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఈరోజు అధికారులు లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించారు. ఎమ్మెల్యే తన కార్యకర్తలకు, అర్హత లేని వారికి ఇండ్లను కేటాయించారని అర్హులైన లబ్ధిదారులు మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు