వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.) ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సబ్ రిజిస్టార్ ల అక్రమాలు, కాసుల కక్కుర్తి కలకలం రేపుతున్నాయి. వనస్థలిపురం సబెజిస్ట్రార్ కార్యాలయంలో మూడు నెలల వ్యవధిలోనే అక్రమాలతో ఇద్దరిపై వేటు పడింది. ఆగస్టులో సబ్ రిజిస్ట్రార్ ఎస్. రాజేష్
సబ్ రిజిస్టార్ సస్పెండ్


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సబ్ రిజిస్టార్ ల అక్రమాలు, కాసుల కక్కుర్తి కలకలం రేపుతున్నాయి. వనస్థలిపురం సబెజిస్ట్రార్ కార్యాలయంలో మూడు నెలల వ్యవధిలోనే అక్రమాలతో ఇద్దరిపై వేటు పడింది. ఆగస్టులో సబ్ రిజిస్ట్రార్ ఎస్. రాజేష్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకోగా.. కాసుల కక్కుర్తితో పార్కు స్థలం ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినందుకు వనస్థలిపురం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంగళవారం సస్పెండ్ చేసింది. ఒక పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో వేటు వేసింది. గత సబ్ రిజిస్ట్రార్ రాజేష్ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.70 వేలు లంచం తీసుకుంటూ చిక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్కు సబ్ రిజిస్ట్రార్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande