
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
2015 గ్రూప్-2 నియామకాలు రద్దు
చేస్తూ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై రివ్యూ అప్పీల్ కు వెళ్లాలని TGPSC భావిస్తున్నట్టు సమాచారం. హైకోర్టు తీర్పుపై మంగళవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తరువాత తీసుకొనే చర్యలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ వివాదంలో 2019లో టెక్నీకల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1032 మందికి పలు విభాగాల్లో పోస్టింగులు ఇచ్చారు.
నియామకాలు జరిగిన 6 ఏళ్ల తరువాత ఆ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేయడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదే విషయంపై కోర్టునే ఆశ్రయించాలని భావిస్తోంది TGPSC.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..