అధ్యక్ష పదవీలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ము బీఆర్ఎస్ కి ఉందా..? : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి, 19 నవంబర్ (హి.స.) ప్రతిపక్ష నాయకుడి స్థానంలో బీసీ నాయకుడిని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ముందా అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం వనపర్తి జి
ఎమ్మెల్యే  మేఘా రెడ్డి


వనపర్తి, 19 నవంబర్ (హి.స.)

ప్రతిపక్ష నాయకుడి స్థానంలో బీసీ

నాయకుడిని, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిలో దళిత నాయకుడిని కూర్చోబెట్టే దమ్ముందా అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే 10,688 మందికి సీఎం సహాయ నిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఎల్బీసీ లబ్దిదారులకు మొత్తం రూ.64,32,04.598 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి కట్టుబడి పాలనలో, అభివృద్ధి లో మహిళలను భాగస్వాములను చేశామన్నారు. వనపర్తి నియోజకవర్గంలో సీఎం, మంత్రులు శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, కాలవలు, తదితర అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande