ఎన్కౌంటర్ లో.హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హుద్మా స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి
అమరావతి, 20 నవంబర్ (హి.స.) ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి. ఈ గ్రామంలో మొత్తం ఇళ్లు 50 మాత్రమే. అయితే ఆ ఊరి నుంచి 90 మంది యువకులను మావోయిస్టులుగా హిడ్మా తయారుచ
ఎన్కౌంటర్ లో.హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హుద్మా స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దక్షిణ  సుక్మా జిల్లాలోని పువర్తి


అమరావతి, 20 నవంబర్ (హి.స.)

ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి. ఈ గ్రామంలో మొత్తం ఇళ్లు 50 మాత్రమే. అయితే ఆ ఊరి నుంచి 90 మంది యువకులను మావోయిస్టులుగా హిడ్మా తయారుచేశాడు. దశాబ్దాల తర్వాత పువర్తిలో అడుగుపెట్టిన పోలీసులు దాదాపు ఏడాది కిందట అక్కడ సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. అక్కడ వందమంది వరకు జవాన్లు నిరంతరం పహరా కాస్తుంటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పువర్తిలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటుచేయడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది.

పువర్తి పోలింగ్‌ బూత్‌ పరిధిలో మొత్తం 547 ఓట్లు ఉండగా 31 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. ఇక పువర్తి నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. ఇక మరో వాంటెడ్‌ మావోయిస్టు బార్స దేవాది కూడా పువర్తే. హిడ్మా నేతృత్వం వహించిన పీఎల్‌జీఏ ప్లటూన్‌ నంబర్‌. 1లో హిడ్మా తరువాతి స్థానం దేవాదేనని చెబుతారు. దేవాను సుక్కా, దేవన్నగా కూడా పిలుస్తుంటారు. కాగా హిడ్మా తలపై మొత్తంగా రూ.1.80 కోట్ల రివార్డు ఉంది. ఛత్తీ్‌సగడ్‌ రూ.40లక్షలు, మహారాష్ట్ర రూ.50లక్షలు, ఒడిశా రూ.25లక్షలు, ఏపీ రూ.25లక్షలు, తెలంగాణ రూ.25లక్షలు, మధ్యప్రదేశ్‌ రూ.25 లక్షలు చొప్పున రివార్డులు ప్రకటించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande