మావోయిస్టుల వరుస ఎన్‌కౌంటర్లు.. ఏపీ హైకోర్టులో సంచలన పిటిషన్
అమరావతి, 20 నవంబర్ (హి.స.)మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా (Hidma), ఆయన భార్యతో సహా అంగరక్షకులు ఆరుగురు మృతి చెందిన వి
మావోయిస్టుల వరుస ఎన్‌కౌంటర్లు.. ఏపీ హైకోర్టులో సంచలన పిటిషన్


అమరావతి, 20 నవంబర్ (హి.స.)మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా (Hidma), ఆయన భార్యతో సహా అంగరక్షకులు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్ (Operation Kagar), టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగబోతోంది. అప్పటి లోపే మావోయిస్టుల మాటే వినిపించకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముప్పేట దాడికి ప్లాన్ చేస్తోంది. ఇక మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటే టార్గెట్‌గా తెలంగాణ ఎస్‌ఐబీ వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత దేవ్‌జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి (Malla Reddy)ల కోసం ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే, అనూహ్యంగా మావోయిస్టులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణకు చెందిన గంగాధర్ (Gangadhar) అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఈ నెల 18న పోలీసులు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ రేపు హైకోర్టు ధర్మాసనం ఎదుటకు విచారణకు రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande