
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ముంబై,,22 నవంబర్ (హి.స.)
టాటా గ్రూపు సంస్థల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో 12,000 మందిని తొలగించారనే వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఇ-కామర్స్, డిజిటల్ విభాగమైన టాటా డిజిటల్‌లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సన్నద్ధమతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన టాటా న్యూ యాప్ ఆశించినంతగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో, సంబంధిత విభాగంలోనే సిబ్బంది తొలగింపులు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో 50% కంటే ఎక్కువ మందినే తగ్గించాలని యోచిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. కొత్త సీఈఓ సజిత్ శివానందన్ నేతృత్వంలో చేపట్టిన భారీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈఓ కేవలం అమ్మకాల పెంపుతోనే సరిపెట్టకుండా, లాభదాయకత లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆదాయాన్ని పెంచడం, అనవసరమైన ఖర్చులను తగ్గించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ