
పుట్టపర్తి, 22 నవంబర్ (హి.స.): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం.. పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారు. ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ లు ఘన స్వాగతం పలికారు.
మహాసమాధి దర్శనానంతరం హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న రాష్ట్రపతి.. సత్యసాయిబాబా విశిష్ఠత గురించి తెలిపారు. ఆయన బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపించాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్లాదిమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆయన శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV