కారు నియంత్రణ కోల్పోయి.. ద్విచక్రవాహనాలపైకి- నలుగురు ప్రాణాలు కోల్పోగా
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ముంబై,,22 నవంబర్ (హి.
కారు నియంత్రణ కోల్పోయి.. ద్విచక్రవాహనాలపైకి- నలుగురు ప్రాణాలు కోల్పోగా


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ముంబై,,22 నవంబర్ (హి.స.)

డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి.. ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ వాహనం గాల్లో ఎగిరి కిందపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు.

శుక్రవారం సాయంత్రం ఠాణె జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్‌ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. కారు డ్రైవర్‌ లక్ష్మణ్‌ షిండే గుండెపోటుకు గురయ్యారు. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయి ముందున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌ షిండే, మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న కిరణ్‌ చాబేను స్థానికుల బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande