
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 22 నవంబర్ (హి.స.)
దేశంలోకి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ రాకెట్‌ను దిల్లీ (Delhi) పోలీసులు ఛేదించారు. పాక్ నుంచి డ్రోన్‌ల సాయంతో వీటిని దేశంలోకి తీసుకొస్తున్న ముఠాను పట్టుకున్నారు. పాక్ (Pakistan) ఐఎస్‌ఐతో ప్రత్యక్ష సంబంధాలున్న వీరి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలో కొంతమంది భారీగా అక్రమ ఆయుధాలు తరలిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘా ఉంచగా.. రోహిణిలో ఈ ఆయుధ మాడ్యూల్ గుట్టు బయటపడింది. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ