సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
President Draupadi Murmu


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 22 నవంబర్ (హి.స.)

, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ స్వాగతం పలికారు.. ఆ తర్వాత పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికింది సత్యసాయి ట్రస్ట్.. ఆ తర్వాత సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు ద్రౌపది ముర్ము.. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగే సత్య సాయిబాబా శత జయంతి వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె.. సత్యసాయి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి.. ఇక, సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారు.. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.. అయితే, సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాష్ట్రపతి..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande