ఎమ్మెల్యే వస్తే లేవలేదని డాక్టర్ పై చర్యలు.. ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు
చండీగర్, 22 నవంబర్ (హి.స.) పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడలేదనే కారణంతో ఓ డాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రవర్తన సున్నితత్వం లేదనిదని ఇ
పంజాబ్ హై కోర్ట్


చండీగర్, 22 నవంబర్ (హి.స.)

పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడలేదనే కారణంతో ఓ డాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రవర్తన సున్నితత్వం లేదనిదని ఇది చాలా బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికిరూ. 50 వేల జరిమానా విధించింది. వెంటనే సదరు డాక్టర్ ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అంకితభావంతో పని చేసే వైద్యనిపుణుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అవాంఛనీయ సంఘటనలను అరికట్టాలని జస్టిస్ అశ్వినీ కుమార్ విశ్రా, జస్టిస్ రోహిత్ కపూర్ లతో కూడిన ధర్మాసం స్పష్టం చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande