
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 22 నవంబర్ (హి.స.)
: భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్-ఎమ్‌కే1 దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన తేజస్, నింగిలో విన్యాసాలు చేస్తుండగానే నేరుగా కిందికి జారింది. నేలపై పడి పేలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. తేజస్ కుప్పకూలిన ఘటనలో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. నమాన్ష్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది.
34 ఏళ్ల నమాన్ష్ స్యాల్ హిమాచల్ ప్రదేశ్, కంగ్ర జిల్లాలోని పఠియాల్కర్ గ్రామంలో పుట్టారు. తండ్రి జగర్‌నాథ్ స్యాల్ కూడా ఇండియన్ ఆర్మీలో పని చేశారు. నమాన్ష్ సుజన్‌పూర్‌లోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. తండ్రి బాటలోనే నిమాన్ష్ కూడా ఆర్మీ వైపు వచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ప్రస్తుతం వింగ్ కమాండర్‌గా ఉన్నారు. ఆయనకు భార్య, ఓ కూతురు ఉన్నారు. నిమాన్ష్ భార్య కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తోంది. ఆయన తల్లిదండ్రులు కోయంబత్తూరులోని సూలురు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ