హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 22 నవంబర్ (హి.
Mohan Bhagwat


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 22 నవంబర్ (హి.స.)

హిందువులు లేకుండా ప్రపంచం లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మోహన్ భగవత్ మాట్లాడారు. గ్రీస్, ఈజిప్ట్, రోమ్ వంటి సామ్రాజ్యాలను కూడా భారతదేశ నాగరికత ప్రభావం చూపించిందని తెలిపారు.

ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అసలు హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు అని చెప్పారు. గ్రీస్, ఈజిప్ట్, రోమ్ నాగరికతలో హిందువుల ముద్ర ఉందని తెలిపారు. భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని.. సమాజంలో ఒక నెట్‌వర్క్‌ను సృష్టించుకున్నామని.. అందుకే హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఒక వేళ హిందువులు ఉనికిలో లేకుంటే ప్రపంచమే ఉనికిలో లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు.

భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు ఒకే పూర్వీకుల వారసులు అని.. వారంతా హిందువుల మూలాలు కలిగిన వారేనని పేర్కొన్నారు. దేశాన్ని నిర్మించడానికి సైనిక సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం రెండు కూడా సమానంగా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ‘‘దేశాన్ని నిర్మించేటప్పుడు మొదటి అవసరం బలం. బలం అంటే ఆర్థిక సామర్థ్యం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వావలంబనగా ఉండాలి. మనం ఎవరిపైనా ఆధారపడకూడదు.’’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande