
ధర్మవరం , 25 నవంబర్ (హి.స.) శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. పెయింటింగ్ డబ్బా పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ధర్మవరం సాయిబాబా ఆలయం సమీపంలో బొమ్మల తయారీ దుకాణాలు ఉన్నాయి.
బొమ్మల తయారీకి వినియోగించే రంగు డబ్బాను చెత్తతో పాటు కలిపి దుకాణదారులు పడేశారు. ఈ క్రమంలో ఉదయం చెత్తకు నిప్పుపెట్టారు. నిప్పు అంటుకొని డబ్బా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. శబ్దం దాటికి పరిసరాల్లో ఉన్నవారు హడలిపోయారు. ఈ పేలుడు ధాటికి అక్కడే దగ్గరలో ఉన్న కమలేష్, అశోక్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. వారికి చేతివేళ్లు తెగిపడినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పేలుడులో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV