కారును ఢీకొట్టిన భారీ ట్రక్కు.. మహిళా మంత్రికి తప్పిన పెను ప్రమాదం
హఠ్రాస్ , 25 అక్టోబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి శాఖ మంత్రికి పెను ప్రమాదం తప్పిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హఠ్రాస్ (Hathras) జిల్లాలో వివిధ అధికారిక కార్యక్రమా
a-huge-truck-hit-a-car-a-major-accident-that-a-woman-minister-mi


హఠ్రాస్ , 25 అక్టోబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో మహిళా సంక్షేమ, శిశు అభివృద్ధి శాఖ మంత్రికి పెను ప్రమాదం తప్పిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హఠ్రాస్ (Hathras) జిల్లాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బేబీ రాణి మౌర్య (Minister Baby Rani Maurya) శుక్రవారం అర్ధరాత్రి ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై లక్నోకు బయలుదేరింది.

ఈ క్రమంలోనే ఫిరోజాబాద్ (Firozabad) జిల్లా 56 కి.మీ మైలురాయి వద్ద రహదారి రెండు వైపుల నుంచి ట్రాఫిక్‌ను ఒకే లేన్‌లోకి డైవర్ట్ చేశారు. అయితే, మంత్రి కారు వెనకాలే వస్తున్న ఓ భారీ ట్రక్కు టైర్ అకస్మాత్తుగా బ్లాస్ట్ అయి నియంత్రణ కోల్పోయి కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘనలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వసమైంది. మంత్రితో పాటు ఎవరికీ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande