తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువారు మృతి
రామేశ్వరం, 26 నవంబర్ (హి.స.) అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) తీర్థయాత్రకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు తెలుగువారు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పోలీసుల
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగువారు మృతి


రామేశ్వరం, 26 నవంబర్ (హి.స.) అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) తీర్థయాత్రకు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు తెలుగువారు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు శబరిమలకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణమైన క్రమంలో తమిళనాడులోని రామేశ్వరం వద్ద వారి కారు ప్రమాదానికి గురైంది. లారీ, కారు ఢీకొట్టుకోవడంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని నవీన్, సాయిగా పోలీసులు గుర్తించారు. పలాసవాసుల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. అయ్యప్ప భక్తుల మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాధితులతో పాటు బాధితుల కుటుంబానికి సహాయం చేయాలని కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును కోరారు. దీంతో ప్రభుత్వ అధికారులు తగిన సహాయక చర్యలను చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande