
ముంబై, 28 నవంబర్ (హి.స.)గత నాలుగైదు రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో దేశీయంగా ధరలు దిగివచ్చినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 28న తులం బంగారం ధర రూ.1,27,740 వద్ద కొనసాగుతోంది. బంగారం రేట్లు ఒక వైపు క్రమంగా తగ్గుతూ ఉంటే వెండి మాత్రం తీవ్రమైన ర్యాలీని కొనసాగిస్తోంది. నవంబర్ 27న కేజీకి వెండి నవంబర్ 26తో పోల్చితే ఏకంగా రూ.4వేల వరకు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 80 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.180 వద్ద విక్రయాలు జరగుతున్నాయి. అయితే బంగారం మాత్రం నిన్నటితో పోలిస్తే తులంపై 170 తగ్గింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,090 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV