
ముంబై, 3 డిసెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు.. నేడు కాస్త తగ్గాయి. నిన్నటి ధరతో పోల్చితే నేడు తులంపై రూ.10లు తగ్గింది. అదే వెండి కేజీ ధరపై రూ.100లు తగ్గింది. ప్రస్తుతం డిసెంబర్ 3న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,040 ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.1,87,900 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,910 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,040 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,040 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV