బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..?
ముంబై, 4 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలతో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆమాంత
Gold


ముంబై, 4 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక పరిణామాలతో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆల్ లైం రికార్డ్ స్థాయికి చేరుకునే అవకాశముందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేయగా.. ఇవాళ గోల్డ్ రేట్లు స్పల్పంగా పెరిగాయి.

గోల్డ్ రేట్లు ఇలా..

-హైదరాబాద్‌లో 24 గ్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,590కి చేరుకుంది. నిన్న రూ.1,30,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,19,710కి చేరుకుంది. నిన్న ఈ ధర రూ.1,19,700గా ఉంది..

-విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,400గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,533గా ఉంది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande