
ముంబై, 2 డిసెంబర్ (హి.స.)ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2, 2025 నాటికి హైదరాబాద్, విజయవాడ, ముంబై, ఢిల్లీ, చెన్నైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఈ ధరల్లో జీఎస్‌టీ, టీసీఎస్, ఇతర స్థానిక పన్నులు, తయారీ ఛార్జీలు (making charges) చేర్చలేదు. జ్యువెలరీ షాపులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు..
నిన్నటితో పోలిస్తే మార్పు..
(హైదరాబాద్/విజయవాడలో 1 గ్రాము ధర) ఈరోజు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.
24 క్యారెట్లు (1 గ్రాము): నిన్నటి ధర రూ.12,982 కాగా, నేడు రూ.13,049 (+రూ. 67) వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్లు (1 గ్రాము): నిన్నటి ధర రూ. 11,900 కాగా, నేడు రూ. 11,960 (+రూ. 60) వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడతోపాటు దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,760 ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV