యుద్ధం ఎఫెక్ట్.. దేశీయ స్టాక్ మార్కెట్ల క్రాష్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై, 09 మార్చి (హి.స.) పశ్చిమాసియా యుద్ధం, క్రూడ్ ఆయిల్ధరల పెరుగుదల ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు. నిఫ్టీ ట్రేడింగ్ 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమవ్వగా.. 2300
Stock market


ముంబై, 09 మార్చి (హి.స.)

పశ్చిమాసియా యుద్ధం, క్రూడ్ ఆయిల్ధరల పెరుగుదల ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు. నిఫ్టీ ట్రేడింగ్ 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమవ్వగా.. 2300 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ ట్రేడింగ్ మొదలైంది. ట్రేడింగ్ స్టార్టింగ్ సెషన్స్ లోనే భారీ నష్టాలు కనిపించడంతో బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో షేర్లన్నీ నష్టాల్లోనే ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్న నేపథ్యంలో స్టాక్ సూచీలు కుప్పకూలాయి.

పశ్చిమాసియా (Middle East)లో యుద్ధ పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల భారత స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపాయి. సోమవారం ట్రేడింగ్లో దేశీయ సూచీలు భారీగా కుప్పకూలాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల షేర్లు.. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయన్న భయంతో పతనమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేవరకు వోలటాలిటీ (Volatility) ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande