బంగారం, వెండి ధరలు ఢమాల్.. భారీగా తగ్గిన రేట్లు..!
ముంబై, 09 మార్చి (హి.స.)భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బంగారం ధరలు, ప్రభుత్వ దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే రూపాయి–డాలర్ మారకపు విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా
Gold


ముంబై, 09 మార్చి (హి.స.)భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బంగారం ధరలు, ప్రభుత్వ దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే రూపాయి–డాలర్ మారకపు విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా లేదా రూపాయి విలువ తగ్గినా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది..

మహిళలకు గుడ్న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలుకు బ్రేకులు పడ్డాయి. ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అలాగే అమెరికన్ డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల ఈ పతనం నమోదైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్పై కూడా ప్రభావం చూపడంతో ధరలు కొంత మేర తగ్గినట్లు కనిపిస్తోంది.

అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్డేట్ అవుతుంటాయి. అలాగే సోమవారం ధరలు అప్డేట్ అయిన తర్వాత భారీగా తగ్గుముఖం పట్టాయి.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1950 రూపాయలు తగ్గుముఖం పట్టగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1800 వరకు దిగి వచ్చింది. అలాగే వెండి విషయానికొస్తే దీనిపై ఏకంగా 5000 రూపాయల వరకు తగ్గింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande