
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.) కేసీఆర్ కుటుబం అవినీతిపై
ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి పంచాయితీ ఎందుకొచ్చిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుంది? ఈ దేశం, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే అరెస్టు కాలేదా? గత బీఆర్ఎస్ పాలనలో మిమ్మల్ని రెండు సార్లు అరెస్టు చేశారు. నాడు కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకుని అరెస్టు చేశారని సీఎంను ప్రశ్నించారు. కేటీఆర్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని విమర్శించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. పార్ములా ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదని నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు