BRSను కేసీఆర్ BJPకి తాకట్టు పెట్టిండు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.) బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడో తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయనను జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. నవీన్ యాదవ్ గెలుపు
రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)

బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడో తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయనను జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. నవీన్ యాదవ్ గెలుపునకు తాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని సెటైర్లు వేశారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. పొరపాటున కారు గుర్తుకే ఓటేస్తే అది కమలం గుర్తుకు వేసినట్లేనని కామెంట్ చేశారు. మైనార్టీలను మభ్య పెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి అప్పగించి 3 నెలలు గడుస్తోందని అన్నారు.

ఇక ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు లేఖ రాస్తే ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే కేటీఆర్పై విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని రెండు పార్టీలను ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ని ఈడీ విచారించిందని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు విచారణకు పిలవడం లేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందనే విషయాన్ని.. స్వయంగా కేసీఆర్ బిడ్డే బయటపెట్టిందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande