నటుడు సల్మాన్ ఖాన్ కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
జైపూర్, 5 నవంబర్ (హి.స.) బాలీవుడ్ స్టార్ నటుడు సల్మానాఖాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు రాజస్థాన్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇటీవల సల్మాన్ ఓ పాన్ మసాలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిస
షారుక్ ఖాన్


జైపూర్, 5 నవంబర్ (హి.స.)

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మానాఖాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు రాజస్థాన్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇటీవల సల్మాన్ ఓ పాన్ మసాలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సల్మాన్ ప్రచారం చేసిన యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, యువత పెడదోవ పట్టేందుకు, చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తూ రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సల్మాన్ ఖాన్ను విచారణకు హాజరు కావాలంటూ రాజస్థాన్ పోలీసుల ద్వారా సల్మాన్కు నోటీసులు పంపారు. అదేవిధంగా పాన్ మసాలా తయారీ సంస్థకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande