హైదరాబాద్ విజయవాడ మధ్య 65 వ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్
దిల్లీ, 5 నవంబర్ (హి.స.) , : హైదరాబాద్‌-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి.మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగా
హైదరాబాద్ విజయవాడ మధ్య 65 వ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్


దిల్లీ, 5 నవంబర్ (హి.స.)

, : హైదరాబాద్‌-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి.మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని 9 గ్రామాల్లో, నల్గొండ జిల్లాలోని చిట్యాలలో 5, నార్కెట్‌పల్లిలో 5, కట్టంగూర్‌లో 4, నకిరేకల్‌లో 2, కేతేపల్లిలో 4, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో 4, చివ్వెంలలో 6, కోదాడ మండలంలో 4, మునగాల మండలంలోని 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను అక్కడి ఆర్డీఓలకు అప్పగించారు. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ మండలంలో 4, కంచికచర్లలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలులో 3, ఇబ్రహీంపట్నంలో 12, విజయవాడ రూరల్‌లో 1, విజయవాడ వెస్ట్‌లో 2, విజయవాడ నార్త్‌ పరిధిలోని 1 గ్రామంలో భూసేకరణ చేపట్టే బాధ్యతలను అక్కడి జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande