మాజీ సీఎం వి ఎస్ జగన్ కృష్ణ జిల్లా ప్రయాణ అట్టర్ ఫ్లాప్
కృష్ణా, 5 నవంబర్ (హి.స.) మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతు
మాజీ సీఎం వి ఎస్ జగన్ కృష్ణ జిల్లా ప్రయాణ అట్టర్ ఫ్లాప్


కృష్ణా, 5 నవంబర్ (హి.స.)

మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్‌ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande