విజయవాడ ఆటోనగర్ లో మధ్యాహ్నం భారీ.వర్షం
అమరావతి, 5 నవంబర్ (హి.స.) : విజయవాడ ఆటోనగర్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆటోనగర్ పూర్తిగా నీట మునిగింది. ఏ రోడ్డు చూసినా జలాశయాన్ని తలపించేలా మారిపోయాయి. షెడ్డుల్లోకి
విజయవాడ ఆటోనగర్ లో మధ్యాహ్నం భారీ.వర్షం


అమరావతి, 5 నవంబర్ (హి.స.)

: విజయవాడ ఆటోనగర్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆటోనగర్ పూర్తిగా నీట మునిగింది. ఏ రోడ్డు చూసినా జలాశయాన్ని తలపించేలా మారిపోయాయి. షెడ్డుల్లోకి నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. ఆటోనగర్‌తో పాటు పటమట పోలీస్ స్టేషన్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్డు, మహానాడు రోడ్డు, బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పటమట సెంటర్, పీ అండ్ టీ కాలనీ, ప్రసాదంపాడులో మోకాళ్ల లోతు నీరు చేరింది. వీఎంసీ సిబ్బంది యంత్రాల సహాయంతో నీటిని తొలగిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande