
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)
రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ శాఖ అధికారులకు సూచించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య అధికం అవుతున్న నేపథ్యంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ మెంబెర్స్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ నాన్ అఫీషియల్ మెంబెర్స్ కు ఇవాళ హైదరాబాద్ లోని మెర్క్యూరీ హోటల్లో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు