నాణ్యమైన సేవలే లక్ష్యం : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్, 5 నవంబర్ (హి.స.) ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. భారీ వర్షం కురిసిన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటమునిగిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్య
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే


నాగర్ కర్నూల్, 5 నవంబర్ (హి.స.)

ప్రజలకు నిరంతరం నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. భారీ వర్షం కురిసిన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటమునిగిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలు మున్సిపల్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరిందో గుర్తించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన చోట శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande