
ఆదిలాబాద్, 5 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన
నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటిని బుధవారం ముట్టడించారు. మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఎంపీ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో నాయకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో కొద్దిసేపు తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్నని పోలీసు స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు