
వికారాబాద్, 5 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గo వికారాబాద్ జిల్లా
కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య
కార్యాచరణ కమిటీ నాయకులు చెవులో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసనలు చేపట్టారు. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలను ఇతర చోట్లకు తరలించవద్దని వాటిని కొడంగల్ లోనే ఏర్పాటు చేయాలని వారు అన్నారు. బుధవారం కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాల తరలింపుతో కొడంగల్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
కొడంగల్ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. మెడికల్ కళాశాలకు, సమీకృత గురుకులాలు తరలించకుండా విద్యాసంస్థలను తీసుకువచ్చి కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా ఏర్పాటు చేయాలన్నారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కొడంగల్ అభివృద్ధి జరుగుతుందని భావిస్తే తీరా ఇతర ప్రాంతాలకు తరలించడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు