
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)న్యూఢిల్లీ, నవంబర్ 05: ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ నేపథ్యంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమవుతుంది. నవంబర్ 5వ తేదీ ఆకాశంలో చంద్రుడు సాధారణంగా కంటే పెద్దగా.. మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. బుధవారం సాయంత్రం సరిగ్గా 6.49 గంటలకు చందమామ ఈ కనువిందు చేయనున్నాడు. దీనినే బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు.
పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత సమీపంలోకి చేరడంతో ఈ అద్భుతం జరుగుతుంది. ఈ సూపర్ మూన్ వేళ.. చంద్రుడు మాములు కంటే 13 శాతం పెద్దగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా వస్తాడు. ఈ సూపర్ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడనున్న రెండోది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు