
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)
కార్తీక పౌర్ణమి కాలంతో పాటే సాగే
క్రమంలో క్రమశిక్షణకు మనిషి ఇవ్వవలసిన ప్రాధాన్యం గురించి తెలియజేస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ ఆయన పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. కార్తీక మాసం అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తొలగించుకోవాలనే సందేశాన్ని ఇస్తుందన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో కాకుండా, సామాజిక కోణంలోనూ పండుగ సందేశాన్ని అందిస్తుందన్నారు. సేవా భావం, దాన గుణంకు గల గొప్పతనాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ పర్వదినంలోని అంతరార్థాన్ని గ్రహించి ప్రతిఒక్కరూ భగవంతుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు.
గురునానక్ జయంతి శుభాకాంక్షలు..
సిక్కుల ఆరాధ్య గురువైన గురు నానక్ జయంతిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. గురు నానక్ బోధనలు మనలో జాలి, కరుణ నింపాలని కోరుకున్నారు. సమాజంలో సోదర భావం పెంపొందించాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..