
యాదాద్రి భువనగిరి, 5 నవంబర్ (హి.స.)
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని బుధవారం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి క్షేత్రంలోని ఆలయ మాడా వీధులు పూర్తిగా కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో పెద్ద ఎత్తున సందడిగా మారాయి. ఈ సందర్భంగా వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ స్వామికి పూజలు నిర్వహించారు. దీపారాధన మండపంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక పూజలు జరిపించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు