ఢిల్లీ ఎయిర్పోర్టులో టెక్నికల్ సమస్య.. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం
న్యూఢిల్లీ, 7 నవంబర్ (హి.స.) ఢిల్లీ పరిధిలోని ఇండిగో ఎయిర్లైన్స్ తో పాటు అన్ని విమాన సర్వీసులలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్ సిస్టమ్ సాంకేతిక సమస్య కారణంగా 100కు పైగా విమాన రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఈ హ
ఢిల్లీ ఎయిర్పోర్ట్


న్యూఢిల్లీ, 7 నవంబర్ (హి.స.)

ఢిల్లీ పరిధిలోని ఇండిగో ఎయిర్లైన్స్ తో పాటు అన్ని విమాన సర్వీసులలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్ సిస్టమ్ సాంకేతిక సమస్య కారణంగా 100కు పైగా విమాన రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో సిస్టమ్ స్లోడౌన్, చెక్ ఇన్ ప్రక్రియలు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే ప్యాసింజర్లకు అన్ని విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి. ఫ్లైట్ సర్వీసెస్ రియల్ టైమ్ అప్డేడేట్స్ కోసం తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande