
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై, 07నవంబర్ (హి.స.)
ఈ వారం వరుసగా మూడో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం 1,067 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. గత ఐదు సెషన్లలో విదేశీ మదుపర్లు 15 వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, మెటల్, ఫైనాన్సియల్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ సెక్టార్లలో అమ్మకాలు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి
గత సెషన్ ముగింపు (83, 459)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం సమయంలో కాస్త పుంజుకున్న సూచీలు మళ్లీ చివరి గంటలో నష్టాల వైపు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో 83, 311 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 87 పాయింట్ల నష్టంతో 25, 509 వద్ద స్థిరపడింది
సెన్సెక్స్‌లో ఆస్ట్రాల్ లిమిటెడ్, ఆసియన్ పెయింట్స్, పేటీఎమ్, మనప్పురం ఫైనాన్స్, ఇండస్ టవర్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). డెలివరీ, గ్రాసిమ్, ఇండియన్ హోటల్స్, బ్లూ స్టార్, హిందాల్కో మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 272 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 568 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.61గా ఉంది
10
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ