
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ నవంబర్ 07( హి.స.) దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి విజయం సాధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్షులతోసహా నాలుగు పదవులను దక్కించుకుంది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్‌ల (డీఎస్‌ఎఫ్) కూటమి గురువారం వెల్లడైన ఫలితాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. అదితీ మిశ్ర అధ్యక్షురాలిగా, కిళకూట్ గోపికాబాబు ఉపాధ్యక్షుడిగా, ప్రధానకార్యదర్శిగా సునీల్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా డానిష్ అలీ గెలుపొందారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ