పైలట్లను నిందించొద్దు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక సూచన
అహ్మదాబాద్, 7 నవంబర్ (హి.స.) విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. . అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఇదే అంశంపై పైలట్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ సబ
AIR INDIA


Air India plane crash


అహ్మదాబాద్, 7 నవంబర్ (హి.స.) విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. . అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

తాజాగా ఇదే అంశంపై పైలట్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ సబర్వాల్(91) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని.. తన కొడుకుపై వస్తున్న నిందలు ఈ వయసులో తట్టుకోలేకపోతున్నట్లు పిటిషన్‌లో వాపోయాడు. శుక్రవారం పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. నివేదిక రాకుండా పైలట్‌ను ఎలా నిందిస్తారని తప్పుపట్టింది. వృద్ధ వయసులో ఈ భారాన్ని మోయొద్దని.. ఇందులో మీ కుమారుడు తప్పు లేదని న్యాయస్థానం సూచించింది. తుది నివేదిక వచ్చేంత వరకు పైలట్‌ను ఎవరూ నిందించొద్దని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande