మీ డబ్బు.. మీ హక్కు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 09 డిసెంబర
pm modi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)

క్లెయిమ్‌ చేయని ఆస్తుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ‘లింక్డిన్’ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్‌ చేయని నగదును దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు (PM Modi on అందుకోసం ‘మీ డబ్బు.. మీ హక్కు’ మూమెంట్‌లో పాల్గొనాలని సూచించారు.

భారతీయ బ్యాంకుల్లో రూ.78 వేల కోట్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో రూ.14 వేల కోట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో రూ.3వేల కోట్లు, డివిడెండ్లు రూ.9వేల కోట్లు క్లెయిమ్‌ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఇటువంటి ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్లను ఆయన పంచుకున్నారు. ప్రతి పౌరుడు తనకు చెందిన సొమ్మును తిరిగి పొందేందుకే ఈ మూమెంట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ‘‘మర్చిపోయిన ఆస్తులను కొత్త అవకాశంగా మార్చుకోండి. ఈ మూమెంట్‌లో భాగం కండి. ఈ ఆస్తుల వివరాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ.. ఇవన్నీ ఎన్నో కుటుంబాలు కష్టపడి కూడబెట్టిన పొదుపు, పెట్టుబడులను సూచిస్తున్నాయి’’ అని ప్రధాని (PM Modi) తన పోస్టులో రాసుకొచ్చారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande