ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావొచ్చు- పౌర విమానయాన శాఖ మంత్రి
ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.), డిసెంబరు 10: ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే అయి ఉండొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సంక్షోభం ముందువరకు ఉన్న పరిస్థితి, విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే.. అ
Indigo Airlines


ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.), డిసెంబరు 10: ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే అయి ఉండొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సంక్షోభం ముందువరకు ఉన్న పరిస్థితి, విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే.. అసలు ఇలా జరిగి ఉండాల్సిందే కాదని చెప్పారు. అవసరమైతే ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ను తొలగించేందుకు, భారీగా జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఇండిగోపై కఠిన చర్యలు చేపడతామని, భవిష్యత్తులో విమానయాన శాఖను ఎవరూ తేలికగా తీసుకోలేని స్థాయిలో ఈ చర్యలు ఉంటాయని చెప్పారు. బుధవారం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్మోహన్‌నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండిగో సంక్షోభం వెనుక ఏదో ఉద్దేశపూర్వక అంశం ఉన్నట్టు కనిపిస్తోంది.

వారి నిర్వహణ తీరు, సర్వీసులపై వారికి ఉన్న పట్టును బట్టి చూస్తే.. ఈ సంక్షోభం ఏర్పడి ఉండకూడదు. అంతేకాదు ప్రత్యేకంగా ఆ సమయంలోనే సమస్య ఎందుకు మొదలైంది. అది ఎలా సంక్షోభానికి దారితీసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ అంశాలన్నింటిపైనా లోతుగా విచారణ సాగుతోందని వెల్లడించారు. ఇక ఇండిగో సీఈవోను తొలగించవచ్చనే ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘ఒకవేళ అవసరమైతే కచ్చితంగా తొలగిస్తాం. అంతేకాదు విధించేందుకు అవకాశమున్న అన్ని జరిమానాలు వేస్తాం. ఇండిగో సంక్షోభానికి సంబంధించి అన్ని కోణాలనూ పరిశీలిస్తున్నాను. గత ఏడు రోజులుగా నేను సరిగా నిద్ర కూడా పోలేదు. చాలా సేపు ఆఫీసులోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూనే ఉన్నాను..’’ అని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande