
బెంగళూరు, 11 డిసెంబర్ (హి.స.)
మైక్రోసాఫ్ట్ చైర్మెన్, సీఈవో సత్యా నాదెళ్ల ఇవాళ బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. భారత్లోని కృత్రిమమేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. క్లోడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది భారతీయులకు కృత్రిమ మేధపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ఉత్తమైన మౌళిక సదుపాయాల్ని కల్పించనున్నట్లు చెప్పారు.సుమారు 17.5 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు సత్యానాదెళ్ల తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు