
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై, 09డిసెంబర్ (హి.స.)
గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. రూపాయి కాస్తా కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటనపై ఆసక్తి, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 666)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 84, 979 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 75 పాయింట్ల లాభంతో 25, 915 వద్ద కొనసాగుతోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ