
న్యూఢిల్లీ, 10 డిసెంబర్ (హి.స.)
భారత్లో రైలు టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉన్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పొరుగు దేశాలతో పోల్చినా లేక అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా.. మన రైల్వే టికెట్ ధరలు తక్కువే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. టికెట్ ధరలను కనిష్ట స్థాయిలో ఉంచేందుకు భారతీయ రైల్వేశాఖ గతేడాది సుమారు 60 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యుడు ఎంకే విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో మంత్రి వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..