
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)
దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఈ దీపాల పండగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండగను చేర్చారు (Deepavali inscribed on UNESCO Heritage list). దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో భారత్‌కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందాయి. వీటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గాపూజ, గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల మొదలైనవి ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సి ఉందని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు. యునెస్కో 20వ సదస్సు ఈనెల 13 వరకూ దిల్లీలోని ఎర్రకోటలో జరుగుతోంది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది ప్రతినిధులు వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ