పోలీసుల అదుపులో గోవా నైట్‌క్లబ్‌ యజమాని
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} ఢిల్లీ 09 డిసెంబర్ (హ
పోలీసుల అదుపులో గోవా నైట్‌క్లబ్‌ యజమాని


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)

గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్‌ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్‌లో సహా యజమానిగా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్‌ను కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో ‍అధికారులు నిన్న మరో క్లబ్‌ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో ‍అగ్నిప్రమాదం జరిగిన క్లబ్‌కు కో పార్టనర్‌గా ఉన్న అజయ్‌ గుప్తా ‍అనే వ్యక్తిని పోలీసులు ‍అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్‌ పార్టనర్‌ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్‌ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande